సినిమా తీస్తే పాన్ ఇండియా హిట్ పక్కా.. కేటీఆర్ వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి సెటైర్

by Disha Web Desk 4 |
సినిమా తీస్తే పాన్ ఇండియా హిట్ పక్కా..  కేటీఆర్ వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: క్రియేటివ్ కంటెంట్‌తో పాన్ ఇండియా సినిమాలుగా ఆర్ఆర్ఆర్, బాహుబలి, పుష్ప నిలుస్తుండగా...క్రియేటివ్ ఆలోచనలతో దేశాన్ని పాలించాలనే సీఎం కేసీఆర్ నిర్ణయంలో తప్పేముందని నిన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అందుకే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశిస్తున్నారని, తప్పక విజయం సాధిస్తారని కేటీఆర్ నమ్మకం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.

అవును, కేసీఆర్‌ అవినీతి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిన పాన్-ఇండియన్ స్టార్‌గా అంచనా వేయాలని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వంశం రాష్ట్ర సంపదను ఎలా కొల్లగొట్టి అవినీతి రాజకీయ సామ్రాజ్యాన్ని స్థాపించిందో ప్రతి భారతీయుడికి తెలియజేయండి అని తెలిపారు. కేసీఆర్ రహస్యమైన గతం, తన అవాస్తవ రాజకీయ ప్రయాణంపై ఒక సినిమా తీస్తే అది తప్పకుండా పాన్ ఇండియా హిట్ అవుతుందంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.

Also Read: ఎంపీ బరిలో జీవిత రాజశేఖర్? అక్కడ నుంచి టికెట్ కన్ఫార్మ్?


Next Story