తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. తుఫాన్ హెచ్చరిక

by Dishanational2 |
తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. తుఫాన్ హెచ్చరిక
X

దిశ, ఏపీ బ్యూరో: బంగాళాఖాతంలో అండమాన్‌‌కి దగ్గర్లో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండగా మారి మరింత బలపడి తుఫానుగా మారొచ్చనే అంచనాలో వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల కంటే తమిళనాడు, పుదుచ్చేరిపై ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా చిన్నపాటి వర్షాలు కురుస్తాయనీ తెలంగాణ, ఒడిశాపై మబ్బులు ఉంటాయని చెబుతున్నారు. ఓ అంచనా ప్రకారం అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా వెళ్లి 48 గంటల్లో తుఫానుగా మారుతుంది. అందువల్ల ఈనెల 8న తీరం దాటే అవకాశం ఉంది. అప్పుడే తమిళనాడు , పుదుచ్చేరిలో వర్షాలు కురుస్తాయి. అయితే, అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో రాత్రివేళ ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయి. చలి తీవ్రత తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి : సంగారెడ్డి జిల్లాలో కంపించిన భూమి


Next Story

Most Viewed