నేడు, రేపు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

by samatah |
నేడు, రేపు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురు అందించింది. నేడు, రేపు రాష్ట్రాంలో పలు ప్రాంతలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శని వారం, ఆదివారం 41 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, మరోవైపు వాతావరణంలో మార్పుల వలన పలు చోట్ల ఉరుములు, మెరుపులు వడగంట్లతో కూడిన వర్షం పడవచ్చునని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు సిద్ధిపేట, కామారెడ్డి,సంగారెడ్డి, మహబూబ్ నగర్, భువనగిరి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Next Story