ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్.. ఇకపై భోజనం ఫ్రీ!

by Disha Web Desk 4 |
ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్.. ఇకపై భోజనం ఫ్రీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఇకపై రైళ్లలో ప్రయాణీకులకు ఉచితంగా ఆహారం అంజేస్తామన్నారు. రైల్వే అందిస్తున్న ఈ ఫ్రీ ఫుడ్ కు కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేశారు. కొత్త నిబంధనల ప్రకారం రైలులో ప్రయాణించేటప్పుడు భోజనానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. రైల్వే లో తరచుగా ప్రయాణించే వారు రైలు కోసం చాలా సేపు వేచి ఉండాల్సి వస్తుంది.

కొన్ని సందర్భాల్లో రైలు ఆలస్యంగా వస్తుంది. అయితే మీరు ప్రయాణించే రైలు ఆలస్యమైతే రైల్వే శాఖ భోజన సౌకర్యం కల్పించనుంది. ఆలస్యానికి ఫలితంగా ప్రయాణికులకు ఉచిత ఆహారం అందజేస్తుంది. ఐఆర్ సీటీసీ రూల్స్ ప్రకారం.. మీరు ప్రయాణించే రైలు 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయినప్పుడు భోజన సౌకర్యం కల్పిస్తారు. కేవలం ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణీకులకు మాత్రమే ఈ సదుపాయం ఉంది. శతాబ్ది, రాజధాని, దురంతో వంటి ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి ఈ సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.



Next Story

Most Viewed