సింగరేణి కార్మికులతో రాహుల్ గాంధీ సమావేశం

by Dishafeatures2 |
సింగరేణి కార్మికులతో రాహుల్ గాంధీ సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: బస్సు యాత్రలో భాగంగా వివిధ వర్గాల ప్రజలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశమవుతున్నారు. అందులో భాగంగా గురువారం సింగరేణి కార్మికులతో రాహుల్ సమావేశమయ్యారు. రాహుల్‌ను కలిసిన సింగరేణి కార్మికులు.. తమ సమస్యలను విన్నపించుకున్నారు. సింగరేణి ప్రైవేటీకరణ వల్ల నష్టం జరుగుతుందని, సింగరేణిలో దోపిడీ జరుగుతుందని తెలిపారు. రాజకీయ నాయకుల ప్రేమయం కూడా సింగరేణిలో ఎక్కువైందని చెప్పారు.

సింగరేణి అభివృద్ది జరగడం లేదని రాహుల్‌ వద్ద కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కార్మికుల సమస్యలను విన్న రాహుల్.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిని అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల పక్షాన నిలబడతామని తెలిపారు. సింగరేణి కార్మికులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


Next Story