ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రఘురాం రెడ్డి

by Disha Web Desk 12 |
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రఘురాం రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలొని కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. దీంతో ఎంపీ టికెట్ ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కరీంనగర్, ఖమ్మం స్థానాల అభ్యర్థులు ఎవరనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ వ్యవహారంలో మంత్రులు తమ వారికే టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని పలుమార్లు కలిశారు. అయితే ఆ మూడు స్థానాల అభ్యర్థుల పేర్లు మాత్రం ప్రకటించలేదు. కానీ.. ఈ రోజు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామసహయం రఘురాం రెడ్డి నామినేషన్ వేశారు. అయితే టికెట్ కోసం ముగ్గురు మంత్రుల మధ్య పోటీ నెలకొంది. డిప్యూటీ సీఎం భట్టి తన భార్య నందినికి కాకుంటే రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వమని భట్టి విక్రమార్క సూచించారు. తన తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే రఘురాం రెడ్డికి ఇవ్వమన్న మంత్రి పొంగులేటి కోరినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో రఘురాం రెడ్డి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.



Next Story

Most Viewed