ప్రైవేటు కళాశాలలను తనిఖీ చేయాలి!

by Disha Web Desk 9 |
ప్రైవేటు కళాశాలలను తనిఖీ చేయాలి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పలు ప్రైవేటు ఐటీఐ, ఐటీసీ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలకు, ఎన్సీవీటీ నిబంధనలను విరుద్ధంగా కేవలం ధనార్జనే ధ్యేయంగా కళాశాలలు నిర్వహిస్తున్నారని, వీటిపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎంప్లాయిమెంట్, ట్రైనింగ్ కమిషనర్‌కు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్సీవీటీ నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలు నిర్వహిస్తున్న సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపించిందని, నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ పరోక్షంగా ప్రైవేటు ఐటీఐ, ఐటీసీ కళాశాలల యాజమాన్యాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. కళాశాలపై రాజకీయ నాయకులు ఒత్తిడిలకు లోనవ్వకుండ ప్రత్యేక బృందంచే తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కళాశాలలపై 2023-2024 విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు నిలిపివేయాలని కోరారు.

కేవలం ధనార్జనే ధ్యేయంగా నిబంధనలు పట్టించుకోని కళాశాలలపై చర్యలు తీసుకోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని కళాశాలలపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు టీ.అమరేందర్, శివానంద్, మహమ్మద్ షుకూర్, అజయ్, గణేష్, హరికృష్ణ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story