ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా చిన్నజీయర్ స్వామి.. పొలిటికల్ వర్గాల్లో కొత్త చర్చ!

by Disha Web Desk 19 |
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా చిన్నజీయర్ స్వామి.. పొలిటికల్ వర్గాల్లో కొత్త చర్చ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు రంజుగా మారాయి. ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అందివచ్చిన ఏ అవకాశాన్ని చేజార్చుకోకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీపై రాజకీయ వర్గాల్లో మరోసారి ఆసక్తికర చర్చ జరుగుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ ఈ నెల 16వ తేదీన విడుదల కాబోతోంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 6న తిరుపతిలో ఘనంగా నిర్వహించేందుకు మూవీ మేకర్స్ రెడీ అవుతున్నాయి. అయితే ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన్నజీయర్ స్వామీ హాజరు కాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలోపై ఇప్పటికే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యలో మాటల యుద్ధం కొనసాగగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిన్నజీయర్ స్వామి గెస్ట్‌గా రాబోతున్నారనే ప్రకటన రాజకీయ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

కేసీఆర్‌కు చిన్న జీయర్‌కు మధ్య గ్యాప్:

గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని చేసినా చిన్న జీయర్ స్వామి సూచనలు, సలహాలు తీసుకునేవారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి ఆలయ నిర్మాణంలో చిన్నజీయర్ స్వామి సలహా ప్రకారమే నడుచుకున్నట్లు ప్రచారం జరిగింది. అలా గురుశిష్యుల మాదిరిగా ఏర్పడిన వీరి బంధానికి ఇటీవల కాలంలో తలెత్తిన విభేదాల కారణంగా బీటలు వారినట్లు టాక్ వినిపిస్తోంది.

సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణ నుంచి వీరి మధ్య మరింత పెరిగిన గ్యాప్.. యాదాద్రి ఆలయం పునః ప్రారంభోత్సవం నాటికి తారా స్థాయికి చేరిందనే ప్రచారం వినిపించింది. ఈ క్రమంలో గతంలో పొగడ్తలతో ముంచెత్తుకున్న ఈ ఇద్దరు ఇప్పుడు పరస్పరం ఎదురుపడే పరిస్థితి లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆదిపురుష్ మూవీ ప్రీరిలీజ్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా చిన్నజీయర్‌ను ఆహ్వానించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా అనే చర్చ జరుగుతోంది.

ఆదిపురుష్‌ను టార్గెట్ చేసిన కేటీఆర్:

ఇటీవల కాలంలో బీజేపీ జాతీయ స్థాయిలో కొన్ని సినిమాలను ప్రమోట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి సినిమాల వెనుక బీజేపీ నేతలు ఉన్నారో లేదో ఎవరికీ తెలియనప్పటికీ వాటిని బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం ఆసక్తిని రేపుతోంది. అయితే సినిమాలపై బీజేపీ ఫోకస్ పెట్టడాన్ని మంత్రి కేటీఆర్ గతంలో టార్గెట్ చేశారు. బీజేపీ తమ భావజాల వ్యాప్తి కోసం సినిమా రంగాన్ని ఉపోయోగించుకుంటోందని ఇందుకోసం పలు సినిమాలకు బీజేపీ నేతలే ఫండింగ్ చేస్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ‘ఉరి, ది కాశ్మీర్, ఫైల్స్‌తో పాటు ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీ కూడా ఈ కోవకు చెందినవే అన్నారు.

వీటితో పాటు మరికొన్ని సినిమాలను బీజేపీ తీయబోతోందని చెప్పారు. శ్రీరాముడి సెంటిమెంట్‌తో బీజేపీ తమ భావజాలాన్ని యువతలో పెంచడానికి ఈ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అయితే ఆదిపురుష్ మూవీపై గతంలో కేటీఆర్ కామెంట్ చేయగా ఈ మూవీ కార్యక్రమానికి కేసీఆర్‌తో విభేదాలు ఏర్పడిన చిన్నజీయర్‌ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించడం ఆసక్తిని రేపుతున్నది. ప్రీరిలీజ్ వేదికను సైతం కలియుగ దైవం ఏడుకొండల స్వామి కొలువుదీరిన తిరుపతి పట్టణాన్ని ఎంచుకోవడం వెనుక పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.

Also Read: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లిప్ కిస్ చేసిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!!

Adipurush : ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ ఖరారు.. ఇండస్ట్రీలో ఇదే ఫస్ట్ టైం!


Next Story

Most Viewed