RBI సంచలన నిర్ణయం.. ATM, బ్యాంక్‌ల వద్ద క్యూ కట్టిన జనం!

by Disha Web Desk 19 |
RBI సంచలన నిర్ణయం.. ATM, బ్యాంక్‌ల వద్ద క్యూ కట్టిన జనం!
X

దిశ, వెబ్‌డెస్క్: రూ. 2 వేల నోట్లు రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న సంచలన నిర్ణయంతో మళ్లీ ఏటీఏం సెంటర్లు, బ్యాంకులకు జనం పరుగులు పెడుతున్నారు. శుక్రవారం రూ. 2వేల నోట్లు రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించడంతో శనివారం తెల్లవారుజూము నుండే రెండు వేల రూపాయల నోట్లతో ప్రజలు ఏటీఎంలు, బ్యాంకుల వద్దకు క్యూ కట్టారు. తమ వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు పోటీ పడుతున్నారు. అయితే, రూ.2 వేల నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చిన రిస్క్ ఎందుకుని జనం ఇవాళ్టి నుండే బ్యాంకులకు వరుస కడుతున్నారు.

అంతేకాకుండా ఆర్బీఐ ప్రకటనతో వ్యాపారులు రూ.2 వేల నోట్లు తీసుకోవడం లేదు.. దీంతో జనాల్లో మరింత ఆందోళన ఎక్కువ అయ్యి.. బ్యాంకులు, ఏటీఎంలకు పరుగులు పెడుతున్నారు. ఏటీఎం డిపాజిట్ మిషన్లలో రెండు వేల రూపాయల నోట్లను డిపాజిట్ చేసేందుకు ఏటీఎం కేంద్రాల వద్ద బారులు తీరారు. దేశంలోని ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి పలు ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజూము నుండే బ్యాంకులు, ఏటీఏంల వద్ద జనాలు క్యూ కట్టారు. 2016లో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేసినప్పుడు బ్యాంకులు, ఏటీఏంల వద్ద కనబడిన దృశ్యాలు తాజాగా మరోసారి కనబడుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

రూ.2000 నోట్ల రద్దు చేస్తూ RBI సంచలన ప్రకటన



Next Story

Most Viewed