వన్ నేషన్ - నో ఎలక్షన్.. బీజేపీ అభ్యర్థి గెలుపుపై KTR సెటైరికల్ ట్వీట్

by Disha Web Desk 4 |
వన్ నేషన్ - నో ఎలక్షన్.. బీజేపీ అభ్యర్థి గెలుపుపై KTR సెటైరికల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీ సూరత్ ఎంపీ స్థానాన్ని దక్కించుకుంది. అనూహ్య పరిణామాల నడుమ బీజేపీ అభ్యర్థి ముకేష్ దలాల్ ఒక్కరే పోటీలో ఉండగా ఆయన ఏకగ్రీవంగా గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ముకేష్‌కు గెలుపు సర్టిఫికెట్‌ను సైతం అందజేశారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభనీ నామినేషన్ పత్రాలు సరిగా లేవని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక, ఇదే అంశంపై బీజేపీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ‘వన్ నేషన్ - నో ఎలక్షన్.. వెల్ డన్ ఈసీఐ’ అని ట్వీట్ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా బీజేపీ వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అని చెబుతున్న విషయం తెలిసిందే. ఇదే అంశాన్ని వ్యగ్యంగా కేటీఆర్ ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.



Next Story

Most Viewed