ఏప్రిల్ 13న మాజీ సీఎం కేసీఆర్ భారీ సభ.. ఎక్కడంటే??

by Disha Web Desk 12 |
ఏప్రిల్ 13న మాజీ సీఎం కేసీఆర్ భారీ సభ.. ఎక్కడంటే??
X

దిశ, వెబ్‌డెస్క్: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ సీఎం కేసీఆర్ గాయం కారణంగా రాజకీయాల్లో చురుగ్గా ఉండటం లేదు. ఓటమి తర్వాత నల్లగొండలో కృష్ణ నది నీటి జలాల సమస్యపై భారీ మీటింగ్ ఏర్పాటు చేసిన కేసీఆర్.. మరోసారి నల్లగొండలోని ముషంపల్లి రైతులను కలిసి మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా ప్రజా క్షేత్రంలో తిరిగి పంట పొలాలు ఎండిపోవడానికి గల కారణాలను రైతులను అడిగి తెలుసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా ఇదంగా ఏప్రిల్ మొదటి వారంలో జరగనుంది.

ఇదిలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీకి సత్తా చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ పార్టీ ఎంపీ అభ్యర్థులను స్వయంగా సీఎం కేసీఆర్ నిర్ణయిస్తున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల మొదటి సభను ఏప్రిల్ 13న నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఈ భారీ బహిరంగ సమావేశం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.


Next Story

Most Viewed