కవితకు అండగా ఎన్నారై సంఘాలు

by Disha Web Desk 7 |
కవితకు అండగా ఎన్నారై సంఘాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ కవితకు అండగా ఎన్నారై సంఘాలు నిలిచాయి. ‘వీ స్టాండ్ విత్ కవిత అక్క’ అంటూ మద్దుతు తెలిపారు. మేమంతా మీ వెంట ఉన్నామని ప్రకటించారు. సోమవారం భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జన్మదినోత్సవాన్ని లండన్, ఆస్ట్రేలియా, యూఎస్ఏ తో పాటు పలు దేశాల్లో ఘనంగా నిర్వహించారు. రాజస్థాన్‌లోని జైపూర్ సైతం కవిత బర్త్ డే నిర్వహించారు.

లండన్‌లోని తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి ఆధ్వర్యంలో కవిత జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఆదర్శమైన నాయకురాలు, మహిళల హక్కులైన పోరాటాం చేస్తున్న ధీర వనిత అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలని ఎన్నారైలంతా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి సుప్రజ పులుసు, స్వాతి బుడగం, పావని కడుదుల, క్రాంతి, స్నేహ,శ్వేతా, మౌనిక, నంతిని, మమతా, హారిక రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో..

ఆస్ట్రేలియా లోని సిడ్నీ, మెల్బోర్న్ ,కాన్బెర్రా , బ్రిస్బేన్ మరియు అడిలైడ్ పట్టణాలలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంగీత రవిశంకర్ ధూపాటి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వినయ్ సన్నీ ఆధ్వర్యంలో మెల్బోర్న్ లో బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక, దేశ రాజధానినిలో మహిళల హక్కులకై నినదించిన గొంతుక, నిరంకుశ కేంద్ర పాలకులపై పోరాడుతున్న ధీర వనిత కవిత అని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో టీఆరెస్ ఆస్ట్రేలియా కోర్ కమిటి నాయకులు సాయిరాం ఉప్పు, విశ్వామిత్ర , సతీష్ పులిపాక, విక్రమ్ కందుల, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

అండమాన్ నికోబార్ దీవుల్లో..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా నిజామాబాద్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చిన్ను గౌడ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేసి అభిమానాన్ని చాటుకున్నాడు. అండమాన్ నికోబార్ దీవుల్లో బంగళా ఖాతం సముద్రపు అంచుల లోకి వెళ్లిన చిన్నుగౌడ్, ఇతరులు ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. నీటి అడుగున డైవింగ్ చేస్తూ బ్యానర్లను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను టీస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆవిష్కరించారు.

రాజస్థాన్ లోని జైపూర్ లో..

ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను రాజస్థాన్ జైపూర్ లోని జైపూర్ పత్రి హవేలీ వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోజాగృతి రాష్ట్ర కార్యదర్శి సంగ్రామ్ సింగ్, తేజ్ సింగ్ బాటి , శైలేందర్ సింగ్ , గౌరవ్ రాహుల్ ,శాంతి శర్మ, ప్రియాంక శర్మ తదితరులు పాల్గొన్నారు

అజ్మీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు..


కవిత పుట్టిన రోజు పురస్కరించుకొని సోమవారం రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ దర్గాలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కవితను కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా ఎదుర్కోలేక, కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని... కేంద్ర ఏజెన్సీల ను వినియోగించి ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ నాయకులు షరీఫ్ఉద్దీన్, ఫూర్ఖాన్ అలీ తదితరులు పాల్గొన్నారు.


Next Story