మహాజన సభలో మాటల యుద్ధం

by Disha Web Desk 15 |
మహాజన సభలో మాటల యుద్ధం
X

దిశ, కోటగిరి : పోతంగల్ మండల కేంద్రంలోని విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 87 వ మహాజన సభలో గందరగోళం నెలకొంది. గత మహాజన సభలో తీర్మానం చేసిన పాలక వర్గం రద్దు, కార్యదర్శి తొలగింపులను ఎందుకు అమలు చేయలేదు అని పాలకవర్గం సభ్యులతో సంఘం సభ్యులు వాగ్వాదానికి దిగారు. సుమారు నాలుగు కోట్లు సంఘానికి నష్టం వచ్చినా దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని అధ్యక్షుని, కార్యదర్శుని ప్రశ్నించారు. పాలకవర్గం రద్దు విషయంపై హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్న మీరు నాలుగు కోట్ల నష్టం పై ఎందుకు కోర్టును ఆశ్రయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకార సంఘంపై 51 యాక్టు ప్రకారం విచారణకు

ఆదేశించడం సిగ్గుచేటని సంఘానికి చెడ్డ పేరు వచ్చే విధంగా పాలకవర్గం, సంఘం సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే పాలకవర్గాన్ని రద్దుచేసి నాలుగు కోట్ల నష్టానికి గల కారకులపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కార్యదర్శిని వెంటనే తొలగించాలని తీర్మానం చేసి సమావేశాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు విజయ్ పటేల్, లక్ష్మి, శ్రీనివాసరావు, రూప్ సింగ్, సంఘ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్, మాజీ ఎంపీపీ గంధపు పవన్, మాజీ సర్పంచ్​ వర్ని శంకర్, గంట్ల విఠల్ , రమేష్ సెట్, మాండవ దిలీప్ కుమార్, లక్ష్మణ్ పటేల్, గోపాల్ రెడ్డి, ఈర్వంత్ రావు పటేల్, రవీందర్ రెడ్డి, సూదం లక్ష్మణ్, సంఘం సభ్యులు, సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Next Story
null