బుస్సాపూర్ బ్యాంక్ దోపిడికి మూడు నెలలు

by Disha Web Desk 20 |
బుస్సాపూర్ బ్యాంక్ దోపిడికి మూడు నెలలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తమ బంగారం తమకు తిరిగి ఇవ్వాలని బ్యాంక్ ఎదుట కొంతమంది ఖాతాదారులు దర్నాకు దిగారు. బ్యాంక్ లలో దాచుకున్న సొత్తును తిరిగి ఇవ్వాలని బాధితులు సంబంధిత బ్యాంక్ రీజినల్ మేనేజర్ ను నిలదిశారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. భారీగా నగదు, 8 కేజీల బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు.

చోరీ జరిగి మూడు నెలలు గడిచిపోయాయి. నిందితులను పట్టుకోవటంలో పోలీసులు ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఇంత వరకు దొంగల జాడ దొరకలేదు. బ్యాంకులో బంగారం కుదువ పెట్టుకున్న బాధితులు మాత్రం లబోదిబోమంటున్నారు. తమ బంగారం తమకు ఇచ్చేయాలంటూ బ్యాంక్ ఎదుట బాధితులు సోమవారం ధర్నాకు దిగారు.

మూడు నెలల క్రితం జరిగిన బుస్సాపూర్ బ్యాంక్ దోపిడీలో బంగారం తాకట్టు పెట్టి ఆర్థికరుణం తీసుకున్న వారు ప్రస్తుతం ఆందోళనకు గురవుతున్నారు. దోపిడి దొంగలు దోచుకోవడంతో బంగారం కోల్పోయిన బాధితులు సోమవారం ధర్నాకు దిగారు. బుస్సాపూర్ గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో మూడు నెలల క్రితం దొంగతనం జరిగింది.

బ్యాంకులో తాకట్టు పెట్టిన 8 కేజీల బంగారం, నగదును తమకు తిరిగి ఇచ్చేయాలంటూ బ్యాంక్ ఎదుట ధర్నాకు దిగారు బాధితులు. పోలీసులు వచ్చి నచ్చచెప్పినా బాధితులు ధర్నా కొనసాగించారు. చివరకు బ్యాంక్ రీజినల్ మేనేజర్ మహివివేక్ బ్యాంకు వద్దకు చేరుకొని బాధితులను సముదాయించే ప్రయత్నం చేశారు. కస్టమర్లు తాకట్టు పెట్టి ఆర్థిక రుణం తీసుకున్న సమయం నుంచి బ్యాంకు దోపిడీ జరిగిన తేదీ వరకు వడ్డీ తీసుకొని గోల్డ్ స్మిత్ వ్యాపారి బ్యాంకులో ధృవీకరించిన ప్రకారం తాకట్టులో ఉన్న ఒక్క బంగారు ఆభరణానికి ఒక్క గ్రాము చొప్పున తరుగు తీసేసి మిగతా బంగారం ఇవ్వటానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు.

బాధితులు వినకుండా తాము ఎంత బంగారాన్ని తాకట్టు పెట్టామో అంతే బంగారాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసలు నిజామాబాద్ పోలీస్ శాఖ ఏం చేస్తోందని బాధితులు ఆవేదనకు వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలు గడిచినా పోలీసులు ఇంకా దొంగలను ట్రేస్ చేయకపోవటంపై ఆరోపణలు వెళ్లివెత్తుతున్నాయి. భారీ స్థాయిలో బంగారం, నగదు బ్యాంకు నుంచి ఎత్తుకెళ్లిన దుండగులను ఇప్పటి వరకు గుర్తించలేకపోవటంపై అనేక అనుమానాలు వస్తున్నాయి అంటున్నారు బాధితులు.

చోరీ చేసిన నిందితులను పోలీసులు త్వరగా పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. బ్యాంక్ దొంగలు ఉత్తర భారతం వెళ్లారని పదుల సంఖ్యలో పోలిస్ శాఖ టీంలు తిరిగిన ఇప్పటికి అచూకి దొరక లేదు. దానికి తోడు కొందరు నెపాల్ పారిపోయారు అంటున్నారు. దొంగల ఆచూకి దొరక్కపోయిన పర్వాలేదు ఆర్ బీఐ ఉత్తర్వుల ప్రకారం బంగారం దాచిన, తాకట్టు పెట్టిన వారికి తిరిగి ఇచ్చి వేయాలని బాధితులు ఆందోళనకు దిగడం కలకలం రేపింది.





Next Story

Most Viewed