మట్టిని తోడేస్తున్న అక్రమార్కులు..

by Disha Web Desk 1 |
మట్టిని తోడేస్తున్న అక్రమార్కులు..
X

డోనెగాం చెరువులో అనుమతి లేకుండా అక్రమంగా మట్టి రవాణా

పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు

దిశ, జుక్కల్ : జిల్లాలో రోజురోజుకు మట్టి మాఫియా ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా.. కైలాస్ డ్యాం నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం నష్ట పరిహారం వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా .. కొందరు అక్రమార్కులు డ్యాం ప్రాంతంలో ఉన్న భూముల్లో మట్టిని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారనా గ్రామస్థులు వాపోతున్నారు. డొనెగాం చెరువులో ఇంత తతంగం జరుగుతున్నా.. రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం లేదు. కౌలాస్ డ్యాంలో ప్రాంతంలోని డోనేగాం గ్రామంలో రోడ్డు పక్కన భూముల నుంచి మట్టి తవ్వి కర్ణాటకలోని కరంజి గ్రామానికి తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం ఇరిగేషన్ అధికారులకు కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి మట్టి తవ్వకాలు నిలిపివేసి ప్రభుత్వం సంపదను కాపాడాల్సిందిగా గ్రామస్థులు తెలిపారు.


Next Story