మూడు గ్రామాల ప్రజలు రాస్తారోకో.. ఎందుకో తెలుసా..

by Disha Web Desk 20 |
మూడు గ్రామాల ప్రజలు రాస్తారోకో.. ఎందుకో తెలుసా..
X

దిశ, నవీపేట్ : మండలంలోని యంచ వద్ద బాసర రహదారికి ప్రక్కన గల మహేశ్వేరీ రైస్ మిల్ పై చర్య తీసుకోవాలని కోరుతూ నందిగామ, యంచ, అల్జాపూర్ గ్రామాల ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ బాసర ప్రధాన రహదారిపక్కన ఉన్నమహేశ్వేరి రైస్ మిల్ నుండి వచ్చే దుమ్ము, ధూళి, ఊకతో రోడ్డుపై వెళుతున్న ప్రయాణికుల కంట్లో పడటంతో తరచు ఆక్సిడెంట్ లు జరుగుతున్నాయని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా కూడా చర్యలు తీసుకోవడం లేదని వారు మండిపడ్డారు.

స్థానిక తహశీల్దార్ మౌఖిక ఆదేశాల మేరకు రెండు రోజులు మూసివేసి తిరిగి రైస్ మిల్లును నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుమ్ము, ఊక బయటికి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ఆదేశించిన బేఖాతరు చేసి నడిపిస్తున్నారని తెలిపారు. అనంతరం స్థానిక అధికారుల ఆదేశాల మేరకు రైస్ మిల్లును మూసివేయడంతో గ్రామస్థులు శాంతించారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బెగారి సాయిలు, నందిగామ ఉపసర్పంచ్ సాయినాథ్, మాజీ ఉపసర్పంచ్ లాలు యాదవ్, నాగరావు, నందిగామ, యంచ, అల్జాపూర్ నాగరావు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed