శివనామ స్మరణతో మారుమోగుతున్న సిద్ధులగుట్ట...

by Dishanational1 |
శివనామ స్మరణతో మారుమోగుతున్న సిద్ధులగుట్ట...
X

దిశ, ఆర్మూర్: మహాశివరాత్రి సందర్భంగా ఆర్మూర్ లోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్ట శివనామ స్మరణతో మారుమోగింది. ఆర్మూర్ పట్టణంలో శని, ఆది వారాలలో భక్తులు సిద్ధులగుట్టకు పోటెత్తారు. పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి లింగాకార రూపుడైన శివునికి భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జీవన్ రెడ్డి భక్తులతో కలిసి ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ సిద్ధులగుట్ట పుణ్యక్షేత్రమంతా కలియతిరిగారు. ఓం నమః శివాయ అని జీవన్ రెడ్డి నినదిస్తుండగా శివ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

సర్వ సృష్టికీ సంకేతంగా, స్థావర జంగమ సంగమ స్వరూపంగా, లింగమయ్యగా జంగమయ్యగా, శివునిగా, భవునిగా సాంబశివునిగా, అనునిత్యం కొలుచుకుంటున్న పరమ శివుని పర్వదినాన సిద్ధులగుట్ట క్షేత్రం దేదీప్యమానంగా వెలుగుతూ భూలోక కైలాస శోభను సంతరించుకుంది. శ్రీకరం శుభకరం సకల మంగళకరంగా పార్వతీ పరమేశ్వరుల శుభాశీస్సుల కోసం భక్త జనకోటి మొక్కుకున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు శివరాత్రి జాగరణ ఉపవాస దీక్షలను విరమించారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులతో కలిసి భోజనం చేసిన జీవన్ రెడ్డి అడుగడుగునా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులతో చర్చిస్తూ శివభక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత, మున్సిపల్ కౌన్సిలర్లు తలారి మీనా చందు, గంగా మోహన్ చక్రు, కే. సంగీత శ్రీనివాస్, బండారి శాల ప్రసాద్, ఆకుల రాము,ఆలయ కమిటీ డైరెక్టర్లు, నాయకులు పూజా నరేందర్, పండిత్ పవన్, పండిత్ ప్రేమ్, అయ్యప్ప శ్రీనివాస్, అల్జాపూర్ మహేందర్, పోలా సుధాకర్, జనార్దన్ గౌడ్, పృద్వి, మీరా శ్రావణ్, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు...

ఛత్రపతి శివాజీ మహారాజ్ 393వ జయంతి వేడుకలను ఆదివారం ఆర్మూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశ ప్రజల దైవం మాత్రమే కాదని, స్ఫూర్తికి మూలమని అభివర్ణించారు.

Next Story

Most Viewed