నిజాంసాగర్‌లో కేంద్ర బలగాలతో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్..

by Disha Web Desk 6 |
నిజాంసాగర్‌లో కేంద్ర బలగాలతో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్..
X

దిశ నిజాంసాగర్: నిజాంసాగర్ మండలంలో కేంద్ర బలగాలతో బాన్సువాడ డి.ఎస్.పి జగన్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ 2/ic-ఏ సీ పీ రాజేష్ కుమార్, ఏసీపీ ప్రవీణ్ కుమార్ రావత్ తన సిబ్బందితో నిజాంసాగర్ మండలంలోని ముఖ్యమైన సునిశితమైన ప్రదేశాలలో కేంద్ర బలగాలతో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బాన్సువాడ డి.ఎస్.పీ జగన్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో అనుకొని ఘటనలు జరిగినప్పుడు సమాజంలో ఏదైనా అలజడి జరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వెంటనే తిరిగి సమాజంలో స్థానిక పోలీస్ వారికి సహకరించేందుకు స్థానిక పోలీసు వారి సహకారంతో శాంతి భద్రతలు అదుపు లోకి తీసుకు వచ్చేందుకు గాను ప్రజలు అందరూ కూడా తమ యొక్క పండుగలు గాని ఉత్సవాలు గాని ఎటువంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా భయాందోళనకు గురి కాకుండా వారి యొక్క హక్కులను అన్నింటిని అనుభవించే విధంగా ఈ యొక్క వాళ్లకు ఒక రక్షణ ఇచ్చే ఉద్దేశంతో వాళ్లకు భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ మార్చ్ ఫాస్ట్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

99 బెటాలియన్ ఆర్ ఏ ఎఫ్, డి.ఎస్.పి రాజేష్ కుమార్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని ఈనెల 5వ తేదీ నుంచి ఈ ఆరు మండల కేంద్రాలలో, కామారెడ్డి టౌన్, ఎల్లారెడ్డి టౌన్, బాన్సువాడ టౌన్, మద్నూర్ టౌన్, బిచ్కుంద టౌన్, నిజాంసాగర్ టౌన్, లో నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. మండల కేంద్రంలో గాంధీచౌక్, బంజపల్లి, చర్చ్, జామా మసీదు, శ్రీ చంద్రమౌళీశ్వర, అంబేద్కర్ విగ్రహం, వరకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కు చెందిన 60 మంది కేంద్ర బలగాల జవాన్లతో నిజాంసాగర్ పోలీస్ సిబ్బంది కవత్తులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఖలీద్, బాన్సువాడ సిఐ మురళి, నిజాంసాగర్ ఎస్సై రాజు, పిట్లం ఎస్సై విజయ కొండ, ఏ ఆర్ ఎస్సై షేక్ అక్బర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Next Story