ఆ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

by Disha Web Desk 20 |
ఆ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
X

దిశ, బోధన్ : బోధన్ డివిజన్ పరిధిలోని బీ.ఈడీ కళాశాలలో విద్యార్థుల నుండి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఆ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఆలిండియా స్టూడెంట్ బ్లాక్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నాగరాజు అన్నారు. శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా కళాశాల నడుపుతున్న యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు నుంచి ఫీజు ఇష్టారీతిన వసూలు చేస్తూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని అన్నారు.

కళాశాలలు అధికంగా ఫీజులు వసూలుచేస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కన్వీనర్ కోటా ద్వారా అడ్మిషన్ అయిన వారి నుంచి కూడా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు కనీస మౌలికవసతులు కూడా కల్పించని కళాశాల అఫిలియేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగరాజు, నాయకులు రమేష్ కుమార్, రాజు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed