పాపం బస్టాండుకు పేరు రాయిద్దామన్నా బడ్జెట్ కరువు

by Disha Web Desk 20 |
పాపం బస్టాండుకు పేరు రాయిద్దామన్నా బడ్జెట్ కరువు
X

దిశ, గాంధారి : పాపం ఆ బస్టాండ్ కు పేరు రాయించేందుకు కూడా పెయింటింగ్ లు, పెయింటర్ డబ్బు ఖర్చు పెట్టలేని దుర్భర పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో బస్టాండ్ లో సమస్యలు తిష్ట వేసి కూర్చున్నాయి. బస్టాండ్ గురించి అధికారులకు దిశ వివరణ కోరగా సగం వేసిన రోడ్ల గురించి ఆర్ అండ్ బీ ఆర్టీసీ సివిల్ ఇంజనీర్ ఇచ్చిన వివరాల ప్రకారం మొత్తం మీద 2017-18 సంవత్సరానికి 14 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. కానీ బస్టాండ్ పరిధిలో బోర్వెల్ పనిచేయడం మానేసి దాదాపు సంవత్సరాలు గడుస్తుంది. సెప్టిక్ ట్యాంక్ అయితే ఇంతకుముందు కట్టించిందే. నిధులను బోర్వెల్, సెప్టిక్ ట్యాంక్, సీసీ రోడ్ల నిర్మాణానికి వినియోగించాల్సి ఉండగా డబ్బులు సరిపోక సీసీ రోడ్డు మధ్యలో ఆపివేయాల్సి వచ్చిందని చెప్పారు.

కనీస మౌనిక సదుపాయాలకు తాగునీరు సరఫరా, ప్రయాణికులకు టాయిలెట్ సౌకర్యం కూడా లేని దుర్భర పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా అప్పటి కాలంలో కట్టిన బస్టాండ్ చాలా పురాతనమైనది. ఇప్పటికే బస్టాండ్ గోడలు బీటలు వచ్చి పెచ్చులుడుతున్నాయి. ఒకవైపు మట్టి మార్గంలో గుంతలు, ఎత్తు పెళ్ళాలు ఉండడంతో బస్సు ఉయ్యాల మాదిరిగా ఊగుతుంది. కామారెడ్డి డిపో మేనేజర్ ను టాయిలెట్ల పై వివరణ కోరగా టెండర్ పడింది కానీ కాంట్రాక్టర్ వచ్చేవరకు ఆగాల్సిందే అదికూడా టాయిలెట్లను ఉపయోగించిన వారికి మూత్రానికైతే ఐదు రూపాయలు మలమూత్రానికైతే పది రూపాయలుగా ఉంటుంది. ఇప్పటికే చాలా అన్నట్టు ఏకంగా ఈ మధ్య ప్రయాణికుల చార్జి టికెట్ రూపేనా నిలువు దోపిడి సరిపోదన్నట్టు మౌలిక వసతులపై కూడా ఇంత భారమా అని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed