దేవతా మూర్తుల జలాభిషేకం సమయంలో ఆలయ ఈవో ఏం చేశాడో తెలుసా..

by Disha Web Desk 20 |
దేవతా మూర్తుల జలాభిషేకం సమయంలో ఆలయ ఈవో ఏం చేశాడో తెలుసా..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో పలు ఆలయాలకు ఉమ్మడి ఈవో గా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఈఓ వేణు వివాదంలో చిక్కుకున్నారు. ఇటివల మాసశివరాత్రి రోజున నీలకంఠేశ్వర ఆలయంలోని స్వామి వారి పుష్కరిణిలో సాక్షాత్తు దేవుడివిగ్రహాలకు అభిషేకాలు జరుగుతుండగా ఈవో వేణు పుష్కరిణిలో జలకాలాట ఆడుతూ, ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్న విడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అది ఇప్పుడు వైరల్ గా మారింది. నిజామాబాద్ నగరంలో చారిత్రాత్మక ఆలయంగా ప్రసిద్ధి చెందిన నీలకంఠేశ్వర ఆలయంలో ప్రతి ఉత్సవాల సందర్బంగా పుష్కరిణిలో ఉన్న నీళ్లతో దేవుడికి అభిషేకం చేస్తుంటారు. ఇది మహా అపరాధమని తెలిసినా చేసేదేం లేక అర్చకులు, భక్తులు నోర్లు మూసుకున్నారు. అది అధికారం అన్న అహంకారంతో చేశారని అతనిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్ లు కోరుతున్నారు.

ఈఓ వేణు దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న ఆలయాలన్నింటినీ తన దోపిడీకి అడ్డాలుగా మార్చాడని అపవాదు మూటగట్టుకున్నాడు. గుడికి వచ్చే సాధారణ భక్తులను హీనంగా చూడటం, కేవలం వీఐపీల సేవలు, ఆలయాల వేడుకల్లో పెద్ద పెద్ద వాళ్ళు, అధికార పార్టీ నాయకుల సేవలో తరించడం కోసం సామాన్య భక్తులను చిత్రహింసకు గురిచేయడం అతని నిత్య కృత్యం అంటు మండిపడుతున్నారు. భక్తుల పట్ల అమర్యాద, మహిళా భక్తులని కూడా చూడకుండా ఆలయంలో బూతులు మాట్లాడటం, తనను ప్రశ్నించిన వారిని, నిలదీసిన వారిని గుడికే రానీయకుండా చేస్తానని బెదిరించడం, ఏం చేస్కుంటావో చేస్కో అని దుర్భాశలాడటమే పని అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నీల కంఠేశ్వర ఆలయ నూతన రథం నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, నీల కంఠేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే అద్దెలు, ఆలయ ఆవరణలో ఉన్న అక్రమ నిర్మాణాలు, అక్రమ లీజులు వీటన్నింటిలో ఈఓ పాత్ర ఉందని విమర్శలు చేస్తున్నారు. దేవాలయం పవిత్రతకు భంగం కలిగించేలా, భక్తుల మనోభావాలనే దెబ్బతిసేలా ఆలయ పుష్కరిణిలో దేవతా మూర్తులకు అభిషేకం సమయంలో ఈత కోట్టిన ఈఓ వేణును వెంటనే సస్పెండ్ చేయాలని, ఇతడి హయాంలో వివిధ ఆలయాల్లో, ముఖ్యంగా నీలకంటేశ్వర్ ఆలయంలో రథం నిర్మాణం సహా శివరాత్రి, రథ సప్తమి వేడుకల్లో జరిగిన మొత్తం ఆర్థిక లావాదేవీలను జడ్జి స్థాయి అధికారితో విచారణ చేయించి ఇతన్ని శాశ్వతంగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని ప్రభుత్వాన్ని భక్తులు కోరుతున్నారు.



Next Story

Most Viewed