హత్య కేసులో వ్యక్తికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష

by Disha Web Desk 1 |
హత్య కేసులో వ్యక్తికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష
X

నిజామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు

దిశ, నిజామాబాద్ క్రైం : పాత కక్షలను మనసులో పెట్టుకుని మద్యం మత్తులో ఓ వ్యక్తిని పదునైనా ఆయుధంతో హతమార్చిన ఘటనలో ఓ వ్యక్తికి నిజామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సునీత కుంచాల ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. వివరాల్లోకి వెళితే.. 2020 ఫిబ్రవరి 6న పాత నేరస్థుడు అబ్దుల్ కరీం ఆలియాస్ కరీం లాలా, షేక్ అక్బర్ కలిసి నగరంలోని పూసలగల్లిలోని ఓ బార్ లో ఫుల్లుగా మద్యం సేవించాడు. అక్కడి నుంచి రాత్రి 10 గంటల ప్రాంతంలో మద్యం కొనుగోలు చేసి బోధన్ బస్టాండ్ వెనుక వైపు ఉన్న మటన్ మార్కెట్లో మద్యం సేవించారు.

ఆ సమయంలో పాతకక్ష్యలను మనస్సులో పెట్టుకుని కరీం లాలా షేక్ అక్బర్ పై గుర్తు తెలియని ఆయుధంతో దాడి చేశాడు. అక్బర్ తలపై కరీం లాలా విచక్షణారహితంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ వారు ఆధారాలతో సహా నిరూపించడంతో మంగళవారం జిల్లా సెషన్స్ కోర్టు తుది తీర్పును వెలువరించింది. నిందితుడు కరీం లాలాకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అదేవిధంగా ఒకవేళ జరిమానా కట్టని యెడల మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలంటూ తీర్పులో పేర్కొన్నారు.

Next Story

Most Viewed