ప్రజాన్యాయపీఠాలతో, న్యాయార్ధులతో మమేకమ్..

by Disha Web Desk 20 |
ప్రజాన్యాయపీఠాలతో, న్యాయార్ధులతో మమేకమ్..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రతిరోజు ప్రజాన్యాయపీఠాలు నిర్వహిస్తు, న్యాయార్ధులతో మమేకమవుతన్న న్యాయసేవ సంస్థకు మరింత ప్రోత్సాహం పౌరసమాజం అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల కోరారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించి జిల్లా జడ్జీ మాట్లాడుతు...చాలా పౌరవ సేవలు పౌరులకు ప్రభుత్వ శాఖల ద్వారా లభిస్తున్నట్లు న్యాయసేవలు కూడా న్యాయవ్యవస్థ తరపున అందజేస్తున్నట్లు ఆమె గుర్తు చేశారు.రాజీపడదగిన క్రిమినల్ కేసులను ఫిర్యాదుదారులు, బాధితుల మధ్య రాజీకుదిర్చి సమాజంలో సుహృద్భావ సామాజిక మార్పుకు కారణం కాగలిగామని తెలిపారు. సివిల్ వివాదాలను కక్షిదారుల ఉమ్మడి అభిమతం మేరకు అవార్డులు జారీచేసే దీర్ఘకాలిక పరిష్కారాన్ని సూచించగలిగామని ఆమె వెల్లడించారు.

న్యాయసేవ సంస్థ న్యాయ సంబంధిత అంశాలే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ఫలాలను జాతీయ న్యాయప్రాధికార సంస్థ నాల్సా ఆదేశాల మేరకు ప్రభుత్వ శాఖల తోడ్పాటుతో ప్రజల ముంగిటికి తీసుకు వెళ్లగలుగుతున్నామని పేర్కొన్నారు.పాఠశాలలు, కళాశాల విద్యార్థులుకు న్యాయవిఙ్ఞాన సదస్సులు, సమావేశాల ద్వారా చట్ట సంబంధిత విషయాలు తెలియజేస్తున్నట్లు జిల్లాజడ్జి సునీత తెలిపారు.నూతనంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ను ప్రారంభించుకుని నేరారోపణలు ఎదుర్కొంటున్న అర్హులైన ముద్దాయిలకు ఉచిత న్యాయసహయం అందిస్తు నూతన ఒరవడికి ఓనమాలు దిద్దుకున్న విషయాన్ని తెలియజేశారు.

అదనపు జిల్లాజడ్జిలు శ్రీనివాసరావు, షౌకత్ జహాన్ సిద్ధికి మాట్లాడుతు అందరికి అందుబాటులో న్యాయసేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పోలీసులు తమ బాధ్యత గా ప్రతి లోక్ అదాలత్ ను విజయవంతం చేయడంలో సహాయకారులుగా ఉన్నామని నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కిరణ్ కుమార్ తెలిపారు. లోక్ అదాలత్ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జిలు భవ్య, సౌందర్య, గిరిజ, బార్ అధ్యక్షుడు ఎర్రం గణపతి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్, కక్షిదారులు, పోలీసులు, కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.

మొత్తం 6567 కేసుల పరిష్కారం..

శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం 6567 కేసులను కక్షిదారుల అభిమతం మేరకు రాజీపద్దతిన పరిష్కరించినట్లు జిల్లాన్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి తెలిపారు. ఇందులో 36 రోడ్డు ప్రమాద నష్ట పరిహారం దావాలలో 3 కోట్ల 76 లక్షల 49,472 రూపాయలకు గాను అవార్డులు జారిసీజేసి బాధితుల బ్యాంకు ఖాతాలలో జమచేయడం జరిగిందని వివరించారు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ లకు చెందిన 39 మొండి బకాయి కేసులను ఋణగ్రహీతలను ఒప్పించి 35 లక్షల 1765రూపాయలను సదరు బ్యాంకు ఖాతాలలో జమ చేయించామని తెలిపారు. భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ 64 టెలిఫోన్ బిల్లులతో 2 లక్షల 69 వేల 663 రూపాయలకు అవార్డు లను జరిచేశామన్నారు.ట్రాన్స్ కో 1500.విద్యుత్ చౌర్యం కేసులు రాజిచేసి పరిష్కామైనట్లు జడ్జి పద్మావతి పేర్కొన్నారు.



Next Story

Most Viewed