రోగులను వదిలేసి వాటర్ బబుల్ కోసమే వీల్ చైర్..

by Disha Web Desk 20 |
రోగులను వదిలేసి వాటర్ బబుల్ కోసమే వీల్ చైర్..
X

దిశ, నిజామాబాద్ సిటీ : ఈ వీల్ చైర్ లో ఉన్నది పేషేంట్లు అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే, అవన్నీ వాటర్ బబుల్స్ తీసుకెళ్తుంది ఆస్పత్రి సిబ్బంది. అదేంటి వీల్ చైర్ లో తీసుకెళ్లాల్సింది పేషెంట్ అని కదా వాటర్ బబుల్ ఏంటి అనుకుంటున్నారా అదే నిజామాబాద్ దావఖాన స్పెషాలిటీ. నిజామాబాద్ ప్రభుత్వ దావఖాన సిబ్బంది తీరు మారడం లేదు. ఎవరికి చెబితే మాకేంటి మేము ఇలాగే ఉంటాము అన్నట్లుగా సిబ్బంది తీరు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. గురువారం దిశలో ప్రచురితమైన వార్తకు స్పందించిన ఆస్పత్రి సిబ్బంది బాలుని తల్లిదండ్రులతో వివరణ ఇప్పించారు. కానీ సిబ్బందిలో మాత్రం మార్పు రాలేదు.

శుక్రవారం రోజు వాటర్ బబుళ్లను వీల్ చైర్ లో పెట్టుకొని తీసుకెళ్తూ మళ్లీ కనిపించారు. ఇదేంటి ఈ వీల్ చైర్ లు పేషంట్ల కోసం మాత్రమే వాడాలి కదా అని మీడియా ప్రశ్నించగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి 20 లీటర్ల బబుల్ ఎలా మోసుకెళ్లాలి అంటూ ఎదురు ప్రశ్నించారు. గురువారం దిశ రిపోర్టర్ వార్త రాయగ మా పేషెంట్లు కాదని సమాధానం చెప్పిన సిబ్బంది, పేషేంట్ కు వీల్ చైర్ అడగలేదని సమాదానం చెప్పి తప్పించుకోనే ప్రయత్నం చేశారు. ఎందరో పేషెంట్లు నడవలేని పరిస్థితిలో ఉండి కూడా పేషెంట్ బంధువులు ఇబ్బందులు పడుతూ, అవస్థలు పడితు మోసుకెళ్తుంటే ఆసుపత్రి సిబ్బంది మాత్రం వీల్ చైర్ లను వారి పనుల కోసం వాడుకోవడం ఎంతవరకు సమంజసం అని పేషెంట్ బంధువులు ఆరోపిస్తున్నారు.



Next Story

Most Viewed