విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది..

by Disha Web Desk 20 |
విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది..
X

దిశ, ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలో భద్రత లేని పరీక్షలు నిర్వహించి విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్రప్రభుత్వం చెలగాటమాడుతుందని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎం.నరేందర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పదవతరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ పై రాష్ట్రప్రభుత్వం బాధ్యత వహించి వెంటనే విద్యాశాఖ మంత్రిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పరీక్ష ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్రప్రభుత్వం విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎం.నరేందర్ నిఖిల్ యువజన సంఘం కార్యదర్శి టి. శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలో 10వ తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం మూలానే వికారాబాద్ జిల్లా తాండూర్ లోని, వరంగల్ జిల్లాలో పరీక్ష సెంటర్ లో 10వ తరగతి పరీక్ష పేపర్ లీకేజీ జరిగిందని వారు అన్నారు. ఎస్ఎస్సీ పరీక్ష పత్రం లీకేజీ ఘటనల పై అనేక అనుమానాలు, అభియోగాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత జిల్లా కాబట్టి అక్కడ తనకు కావాల్సిన కుటుంబాల విద్యార్థులకు అధిక మార్కులు రావడం కోసం ఉదయం 9:30 పరీక్షలు ప్రారంభం అయితే, ఉదయం 9:37 కే కొశ్చన్ పేపర్ బయటకు వచ్చిందనే ఆరోపణలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా రెండవ రోజు హిందీ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని వరంగల్ జిల్లాలో లీక్ చేశారని అన్నారు. కనీసం పరీక్షలు ప్రారంభం అయి 10నిముషాలు కూడా కాకుండానే బయటం రావడం అంటే ఉద్యేశపూర్వకంగానే లీక్ చేశారేమో అని అనుమానం వ్యక్తం అవుతుందని, వాట్సాప్ గ్రూపులో చక్కర్లు కొట్టడం వంటి విషయాలను చూస్తే ప్రణాళిక బద్దంగానే పేపర్ లీక్ చేసారేమో అనే సందేహాలు కలుగుతున్నాయని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ పరిధిలోని పేపర్ లికేజీ వ్యవహారం ఇంకా మరవక ముందే దానికి సంబందించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తాగజా 10వ తరగతి పేపర్ లీక్ అంటే విద్యాశాఖ, లేక ప్రభుత్వమే లికేజీల ప్రభుత్వమా? అని వారు ప్రశ్నించారు.

పేదబడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అన్యాయం చేయొద్దని, పేపర్లు లీక్ చేసి అమ్ముకున్న అస్సలు నేరస్థులను వెలకితీయాలని, సిట్టింగ్ జడ్జ్ తో న్యాయ విచారణ జరిపించాలని, దీనికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరుస ఘటనల పై ప్రభుత్వం కఠినచర్యలకు పటిష్ఠమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. లేని పక్షంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాపితంగా పెద్ద ఎత్తున ఆందోళనాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్ యువజన సంఘం నాయకులు మనోజ్, నజీర్, పీడీఎస్యూ నాయకులు వంశీ సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.

Next Story