యూరప్ ట్రిప్ వెళ్లేవారికి బిగ్ షాక్..

by Mamatha |
యూరప్ ట్రిప్ వెళ్లేవారికి బిగ్ షాక్..
X

దిశ,వెబ్‌డెస్క్: ఐరోపా పర్యటనకు వెళ్లానుకునే వారికి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. యూరప్ పర్యటన మరింత భారం కానుంది. షెంజెన్ వీసా దరఖాస్తు ఫీజును 12 శాతం పెంచేందుకు యూరోపియన్ కమిషన్ ఆమోదించింది. జూన్ 11 నుంచి ఈ పెంపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని స్లోవేనియా విదేశీ, ఐరోపా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు పెద్దలకు షెంజెన్ వీసా దరఖాస్తు ధర 80 యూరోలు ఉండగా..ప్రజెంట్ దాన్ని 90 యూరోలకు పెంచింది. షెంజెన్ అంటే 29 యూరప్ దేశాల సమాఖ్య. 90 రోజుల వరకు ఆయా దేశాల్లో పర్యటించేందుకు వీలుగా షెంజెన్ వీసాలు జారీ చేస్తారు. ఈ రకమైన వీసాతో ఇతర షెంజెన్ దేశాల్లో పర్యటించేందుకు కూడా అనుమతి లభిస్తోంది.

Next Story

Most Viewed