ఎంబీబీఎస్ విద్యార్ధిని చదువు కోసం ముందుకొచ్చిన దాతలు..

by Dishanational4 |
ఎంబీబీఎస్ విద్యార్ధిని చదువు కోసం ముందుకొచ్చిన దాతలు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ప్రతిభ గల పేద విద్యార్థినికి సాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ గ్రామానికి చెందిన శ్రావణి అనే విద్యార్థి ఇటీవల డాక్టరు సీట్ సంపాదించింది. మొదటి ప్రయత్నంలోనే నీట్‌లో 15000 ర్యాంక్ సాధించి డాక్టర్ సీటు సాధించింది. కౌన్సిలింగ్‌లో సిద్దిపేట సురభి కళాశాలలో గవర్నమెంట్ కోటలో సీటు పొందింది. అయితే ఆర్థికంగా పేద కుటుంబం కావటంతో అడ్మిషన్‌తో పాటు, స్టేషనరీ, ఇతర అవసరాలకు ఇబ్బంది పడుతుంది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన శ్రావణి.. కష్టపడి చదివింది. వైద్యురాలిగా మారనుంది. అయితే తల్లి కస్తూర్భా పాఠశాలలో స్వీపర్‌గా పని చేస్తోంది.

నిరుపేద దళిత కుటుంబానికి చెందిన శ్రావణి తన తల్లి కష్టాన్ని చూసి డాక్టర్ కావాలని, తన కలను నిజం చేసుకుంది. శ్రావణి విషయం తెలుసుకున్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 38 వ డివిజన్ కార్పొరేటర్ గడుగు రోహిత్ అతని మిత్రుడు ప్రణీత్, మిత్ర బృందం కలిసి రూ.80,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. భవిష్యత్తులో కూడా శ్రావణి చదువుకు సాయం అందిస్తామన్నారు రోహిత్. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రోహిత్‌తో పాటు అతని మిత్రులు, సొసైటీ మాజీ ఛైర్మన్ రమణారావు, మాజీ సర్పంచ్ రాజేందర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed