ధరణి తీసేస్తామన్న కాంగ్రెస్ కావాలా...రైతులకు మేలు చేసే బీఆర్ఎస్ కావాలా..

by Disha Web Desk 15 |
ధరణి తీసేస్తామన్న కాంగ్రెస్ కావాలా...రైతులకు మేలు చేసే బీఆర్ఎస్ కావాలా..
X

దిశ, నిజామాబాద్ రూరల్ : ధరణి తీసేస్తామన్న కాంగ్రెస్ కావాలా రైతులకు మేలు చేసే బీఆర్ఎస్ కావాలా అని ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. రూరల్ అభివృద్ధి కోసం కావాల్సిన నిధులు తప్పకుండా ఇస్తామని, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను భారీ మెజారిటీ తో గెలిపించుకోవాలని కోరారు. గురువారం డిచ్ పల్లి లోని నడి పల్లి సాక్షి వద్ద ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి సాధించామని అన్నారు. ప్రజల కోసం కష్టపడుతున్న బాజిరెడ్డి గోవర్ధన్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. గల్ఫ్ లో ఉన్న వాళ్లకు బీమా వర్తించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు దుబారా అని అంటున్నారని, అది ఉండాలా వద్దా అని ప్రజలను అడగగా రైతులు ఉండాలి అని సమాధానం ఇచ్చారు. రైతుబంధును 10 వేల నుంచి 16 వేల వరకు పెంచనున్నామని చెప్పారు.

రాహుల్ గాంధీ ధరణి ని బంగాళా ఖాతంలో కలపాలంటున్నారని, అందులో ఏమైనా పొరపాట్లు ఉంటే సవరిస్తామని అన్నారు. ధరణి ద్వారా రైతు బొటన వేలు పెడితే తప్ప మీ భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రి కి కూడా లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే భూ కబ్జాలు, పాత రిజిస్ట్రేషన్ పద్ధతి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నీటి పై టాక్స్ రద్దు చేశామన్నారు. ప్రస్తుతం 318,000 తలసరి ఆదాయం పెరిగిందన్నారు. రూరల్ లో 3085 ఎకరాల పోడు పట్టాలు పంపిణీ చేశామన్నారు. మంచిప్ప రిజర్వాయర్ ఇజ్రాయిల్ టెక్నాలజీ తో ప్రతి మూడు ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. అక్కడ భూములు నష్టపోయిన రైతులకు తప్పకుండా వీలైనంత ఎక్కువగా బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పినట్లు నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ..రూరల్ లో 50 తండా లను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. జక్రాన్ పల్లి లో

ఎయిర్ పోర్ట్ కేంద్రం ఇవ్వకపోయినా రాష్ట్రం నుంచి ఏర్పాటు చేస్తామన్నారు. రూరల్ లో రైతులకు 17 వేల కోట్ల రుణ మాఫీ అయ్యిందని, ఇంకా 4 వేల కోట్లు ఇస్తే అందరికీ చేరుతాయని అన్నారు. గుండారం కూడా అత్యధిక జనాభా కలిగిన మండలం అని ఇందల్ వాయి,మోపాల్, రామడుగు లాగే మండలంగా మార్చేలా చూడాలన్నారు. రూరల్ లో ఇండ్లు లేని వారికి 10 వేల గృహాలు మంజూరు చేయాలన్నారు. రూరల్ లో 7 బ్రిడ్జి లు, 17 చెక్ డ్యాం లు ఇచ్చారని, గుత్ప లిఫ్ట్ ఇచ్చారని, పనులు నత్త నడకన సాగుతున్నాయని, త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. మాంచిప్ప రిజర్వాయర్ కింద లక్ష ఎకరాలకు నీళ్లు అందించనున్నామని, కానీ రిజర్వాయర్ కింద భూములు నష్టపోయిన వారికి ఎక్కువగా నష్టపరిహారం వచ్చేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్, ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, వివిధ మండలాల మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed