నిజామాబాద్ ఐటీ హబ్ కి ఎనమిది కంపెనీలతో ఒప్పందం

by Disha Web Desk 1 |
నిజామాబాద్ ఐటీ హబ్ కి ఎనమిది కంపెనీలతో ఒప్పందం
X

కేటీఆర్ సమక్షంలో ఎంవోయూలు

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకువెళ్లాలని సంకల్పంతో రాష్ట్ర ఐటీ, పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముందుకు వెళుతున్నారని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ బిగాల మహేష్ అన్నారు. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా జరిగిన సమావేశంలో 100 కంపెనీల సీఈవోలతో ఆయన భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలలోనూ విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించడంతో పాటు ఇక్కడ ఉన్న అనుకూలతలు, తాము కల్పించిన మౌలిక వసతులను కల్పిస్తామన్నారు.

ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ లలో ఐటీ టవర్లను ప్రారంభించామని తెలిపారు, మరికొద్ది రోజుల్లోనే సిద్దిపేట, నిజామాబాద్, నల్గొండలోనూ ఐటీ టవర్ల నిర్మాణం పూర్తి కాబోతోందదని తెలిపారు. దీంతో పాటు ఆదిలాబాద్ లోనూ మరొక ఐటీ టవర్ నిర్మిస్తున్నామని తెలిపారు. మంత్రి కేటీఆర తో జరిగిన సమావేశం అనంతరం నిజామాబాద్ ఇట్ హబ్ ఏర్పాటులో భాగంగా ఎనమిది ఐటీ కంపెనీల ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

సదరు ఒప్పందాల ఫలితంగా తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ ఉద్యోగాలు రాబోతున్నాయి. పరోక్షంగా ఎన్నో వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. ఈ సమావేశాన్ని గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల, ప్రతినిధులు లక్ష్‌ చేపూరి, విజయ్‌ రంగినేని సహకారముతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, చీఫ్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అమర్‌నాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story