మహిళా దినోత్సవం రోజే మహిళలకు అవమానం..

by Disha Web Desk 13 |
మహిళా దినోత్సవం రోజే మహిళలకు అవమానం..
X

దిశ, దేవరకొండ: మహిళా దినోత్సవం రోజున మహిళలను గంటలకొద్దీ నిరీక్షింపజేసి, వారిని ఆకలితో నీరసించే విధంగా చేసిన ఘటన బుధవారం దేవరకొండలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వం చేపట్టిన మహిళా దినోత్సవ అధికారిక కార్యక్రమం.. ఆలస్యంగా జరగడంతో మహిళలు ఆకలితో నిరసించి ఆసనం వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం ప్రభుత్వం దేవరకొండ డివిజన్ వ్యాప్తంగా 1,500 మంది మహిళలు సమభావన సంఘాలు, మహిళా సంఘాలు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, కు ప్రతి ఒక్కరికి చీరలతో సన్మాన కార్యక్రమం తో పాటు మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించే కార్యక్రమం పట్టణంలోని సాయి శివ గార్డెన్‌లో నిర్వహించారు.

అయితే ఇక్కడికి విచ్చేసిన మహిళలు గంటల కొద్ది నిరీక్షించి నిరసించారు. డివిజన్ వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి మహిళా సంఘాల గ్రూప్ సభ్యులు బుధవారం ఏపీవో లు ఉదయం 11 గంటలకు రావాల్సిందిగా ఆయా సంఘాల సభ్యులకు సూచించారు. దీంతో వివిధ మండలాల నుండి వందలాదిగా మహిళలు ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మహిళలు, వృద్ధులు ఎమ్మెల్యే వచ్చి సన్మానించే చీర కోసం ఎదురు చూడవలసి వచ్చింది. కానీ, చీరలు ఇవ్వకపోగా వివిధ సంఘాలకు సంబంధించిన చెక్కులను ఇచ్చి చేతులు దులుపుకున్నారని.. ప్రజా ప్రతినిధుల మీద ఇటు ప్రభుత్వ అధికారుల మీద కార్యక్రమానికి వచ్చిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే సభాస్థలికి చేరుకునగా..ఎమ్మెల్యే మహిళా సంఘాల గ్రూప్ సభ్యులకు చెక్కులు పంపిణీ చేసి కొంతమంది మహిళలను సన్మానించారు. అప్పటికే వృద్ధులు, గర్భిణీలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మహిళా సంఘాల గ్రూప్ సభ్యులు నిరసించి ఆకలితో ఇబ్బందులు పడ్డారు. ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాలలో ఎమ్మెల్యే గంటల కొద్దిగా ఆలస్యంగా రావడం పట్ల, అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలు, అధికారులు, పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే ఆలస్యంగా రావడం పట్ల మహిళా దినోత్సవం రోజున మహిళలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఏ కార్యక్రమం చేపట్టిన కానీ స్థానిక ఎమ్మెల్యే టైముకు రాకపోగా! వచ్చి రాగానే అక్కడ ఉన్నటువంటి అధికారులపై చోటామోటా నాయకుల పై ఆసనం వ్యక్తం చేస్తూ.. కోపపడుతున్నారని పలువురు చర్చించుకోవడం ప్రజలు గమనిస్తున్నారు.



Next Story