- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వం
దిశ, చౌటుప్పల్: సీఎం కేసీఆర్, కేటీఆర్ అహంకారాన్ని ఈ ఎన్నికల్లో దించేస్తామని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ మండలంలో ప్రజా దీవెన సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు భారీ సంఖ్యలో జనాలు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. 60 ఏళ్లు కొట్లాడి ఎంతోమంది ఆత్మ బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవం లేదని మండి పడ్డారు. తెలంగాణలో ఇప్పుడు జరిగే ఎన్నికలు ఆత్మ గౌరవ ఉద్యమం కోసం ,కేసీఆర్ పై ఉద్యమం చేయడానికి అన్నారు. బీజేపీ వాళ్ళ మాటలు నమ్మినా పదవి త్యాగం చేసి పోరాటం చేశానని, ఉప ఎన్నిక తర్వాత మద్యం కుంభకోణం కేసులో కవితని అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని అర్థమైందన్నారు. నల్గొండ జిల్లాలోని బీఆర్ఎస్ లీడర్లకు నేను కాంగ్రెస్‌లోకి వచ్చాను అంటేనే గజ గజ వణుకుతున్నారని తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటును తాకనీయం అని, పది సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్న కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని, తెలంగాణకు దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ మోసం చేశాడని విమర్శించారు. డబల్ బెడ్ రూమ్,ఇంటికొక ఉద్యోగం, మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ మోసం చేశాడని గుర్తు చేశారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం అని తెలిసిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలన్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడిన స్పందించని కేసీఆర్ నా రాజీనామాతో మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి వచ్చి అభివృద్ధి చేశాడన్నారు. లక్షల కోట్లు దోచుకుంటున్న కేసీఆర్ గురించి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఒక తాటి మీదికి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒకసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సిద్దిపేట, సిరిసిల్లకు ధీటుగా అభివృద్ధి చేసి చూపిస్థానన్నారు.