ఇలా కూడా టికెట్ ఇస్తారా ? దూరం ఒక్కటే చార్జీలు వేరు వేరు

by Disha Web |
ఇలా కూడా టికెట్ ఇస్తారా ? దూరం ఒక్కటే చార్జీలు వేరు వేరు
X

దిశ, మోత్కూరు: సమాన దూరాలకు వేరువేరు ఛార్జీలు వసూలు చేస్తున్న ఆర్టీసీ అధికారుల నిర్ణయం పట్ల ప్రయాణికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుత చార్జీలు పెంచక ముందు మోత్కూరు నుంచి భువనగిరికి అలాగే భువనగిరి నుండి ఉప్పల్ వరకు 50 రూపాయల చొప్పున ఎక్స్ ప్రెస్ బస్సు‌కు ఆర్టీసీ చార్జీలు వసూలు చేసేది. గతంలో కూడా యాదగిరిగుట్ట డిపో వారు మోత్కూర్ నుండి భువనగిరికి 50 కి బదులు 55రూపాయలు వసూలు చేస్తుండటంతో ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకు పోగా సరి చేశారు. ఉప్పల్ నుండి భువనగిరికి, భువనగిరి నుండి ఉప్పల్ ఓకే దూరం ఉండడంతోపాటు స్టేజీల విషయాన్ని పరిశీలించినా భువనగిరి నుండి ఉప్పల్ వరకు మార్గమధ్యంలో బీబీనగర్ ఘట్కేసర్ స్టేజీలు ఉన్నాయి. అలాగే భువనగిరి నుండి మోత్కూరు కు కూడా మార్గమధ్యంలో చాడా ఆత్మకూరు స్టేజీలు ఉన్నాయి. అయినప్పటికీ తిరిగి ఇటీవల డీజిల్ రేట్లు పెరిగాయని తిరిగి చార్జీలు పెంచడం జరిగింది. అయితే ఇటీవల చార్జీలు పెంచిన అప్పట్నుంచి పాత పంథాలోనే ఉప్పల్ నుండి భువనగిరి‌కి 60 రూపాయలు వసూలు చేస్తూ భువనగిరి నుండి మోత్కూరు‌కు 65 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రయాణీకులు ప్రశ్నిస్తే అధికారుల నిర్ణయం మేరకే తీసుకుంటున్నామని కండక్టర్లు చెబుతుండడంతో భువనగిరి నుండి మోత్కూర్‌కు టోల్ ప్లాజా బాగా లేకున్నా ప్రయాణికుల తోలు వలసి ఎక్కువ చార్జీలు వసూలు చేయడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు అందజేస్తే సరి చేస్తాం డీఎం. సమాన దూరాలకు వేరువేరు చార్జీలు వసూలు చేస్తున్న విషయమై యాదగిరిగుట్ట డిపో మేనేజర్ సెల్ ఫోన్‌లో వివరణ కోరగా ఆ విషయం తమ దృష్టికి రాలేదని వివరణ ఇచ్చారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story