రూల్స్ మరిచిన నల్లగొండ ట్రాఫిక్ పోలీసులు.. రాత్రి వేళ స్టేషన్లో ఒంటరిగా మహిళ..!

by Disha Web Desk 19 |
రూల్స్ మరిచిన నల్లగొండ ట్రాఫిక్ పోలీసులు.. రాత్రి వేళ స్టేషన్లో ఒంటరిగా మహిళ..!
X

దిశ, నల్లగొండ బ్యూరో: రాత్రివేళ మహిళలను పోలీస్ స్టేషన్లో ఉంచకూడదన్న నిబంధనను నల్గొండ పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కుటుంబ సభ్యులతో కలిసి బైక్‌పై ఒక మహిళ బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో నల్గొండ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు బండిపై వస్తున్న ముగ్గురిని ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. పరీక్షలో బండి నడిపే వ్యక్తి మద్యం సేవించి నడుపుతున్నారని రుజువు అయింది. అతనికి ఫైన్ కూడా వేశారు. అంతేకాకుండా ఆ ముగ్గురిని నల్గొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు తీసుకువచ్చి కూర్చోబెట్టారు. ఈ క్రమంలో బండి నడిపే వ్యక్తి తన పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నాయని, వాటిని స్టేషన్‌లో ఉంచుకొని తనకు బండి ఇవ్వాలని రేపు ఉదయం వచ్చి మీకు సరెండర్ అవుతానని చెప్పారు.

కానీ పోలీసులు పట్టించుకోలేదు. ఇద్దరు పురుషులను బండికి సంబంధించిన పేపర్స్ తీసుకొని రావాలని వాళ్ళ గ్రామానికి పంపించినట్లు తెలిసింది. గ్రామానికి నల్లగొండకు మధ్య దూరం సుమారు 10 నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ ఇద్దరూ వ్యక్తులు వెళ్లి బండి పేపర్లు తీసుకొచ్చే వరకు మహిళను పోలీస్ స్టేషన్లో ఉండాలని షరతు విధించినట్లు సమాచారం. పేపర్ల కోసమే మాత్రమే పంపిస్తున్నామని పోలీసులకు సదుద్దేశం ఉంటే బండి నడిపే వ్యక్తిని మహిళను ఊరికి పంపించి ఒక పురుషున్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకోవచ్చు. కానీ ఇద్దరు పురుషులను పంపి మహిళను పోలీసులు స్టేషన్‌లో కూర్చోబెట్టడంలో ఉన్న అంతరార్థం ఏంటో అర్థం కావట్లేదు. రాత్రివేళ స్త్రీలను పోలీస్ స్టేషన్లో ఉంచకూడదని కనీస అవగాహన పోలీసులు మరిచినట్లుంది. ఇదే విషయమై ట్రాఫిక్ సీఐ నుంచి వివరణ కోరగా.. మహిళను రాత్రివేళ స్టేషన్ తీసుకువచ్చే అవకాశం లేదు. పురుషులే బండి పేపర్లు తీసుకొస్తామని బయటికి వెళ్లారు. మేం కావాలని కూర్చోబెట్టి లేదని క్లారిటీ ఇచ్చారు.



Next Story

Most Viewed