ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు : ఎస్పీ రాజేంద్రప్రసాద్

by Disha Web Desk 15 |
ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు : ఎస్పీ రాజేంద్రప్రసాద్
X

దిశ,కోదాడ (అనంతగిరి) : కళాశాలలో విద్యార్థులు ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో సూర్యాపేట జిల్లా పోలీస్ విభాగం గురువారం యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు సోదరభావంతో కలిసిమెలిసి విద్యను అభ్యసించాలని కోరారు. ర్యాగింగ్ చేసిన వారు 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వ్యసనాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. అవగాహన సదస్సును కోదాడ డీఎస్పి వెంకటేశ్వర రెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం.వి శివప్రసాద్, కోదాడ రూరల్ సీఐ ప్రసాద్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు ఐలయ్య, నాగభూషణం,సురేష్ జిల్లా షీ టీం,భరోసా సిబ్బంది పాల్గొన్నారు.


Next Story

Most Viewed