పేలుడు పదార్థాలు వినియోగిస్తే కఠిన చర్యలు: డీసీపీ రాజేష్ చంద్ర

by Disha Web Desk 11 |
పేలుడు పదార్థాలు వినియోగిస్తే కఠిన చర్యలు: డీసీపీ రాజేష్ చంద్ర
X

దిశ, భువనగిరి రూరల్: అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కందిగడ్డ శివారు హైదరాబాద్ వరంగల్ 163జాతీయ రహదారిపై గల జెఎస్ఆర్ సన్ సిటీ వెంచర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ పేలుళ్లకు పాల్పడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు రాచకొండ ఎస్ఓటీ, ఆలేరు పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు.

ఈ ఆపరేషన్ లో మల్లారెడ్డి, శ్రీనివాస్, కమలాకర్, సుమలాకర్ లను అరెస్టు చేసినట్లు, మరో ఇద్దరు నిందితులు తాడేపల్లి నారాయణ, మహేందర్ లు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 57 జిలిటిన్ స్టిక్స్, 51 ఎలక్ట్రిక్ డిటోనేటర్ లు, 3 బండిల్ల వైరు, కంప్రెసర్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు వినియోగించ వద్దని యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేష్ చంద్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Next Story

Most Viewed