శ్రీనివాస్ గౌడ్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి

by Web Desk |
శ్రీనివాస్ గౌడ్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, సూర్యా పేట: మలిదశ తెలంగాణ ఉద్యమనేత, టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడిమలిదశ తెలంగాణ ఉద్యమనేత, టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా యూత్ అధ్యక్షులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫోన్ లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తుంగతుర్తి శాసన సభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. భవిష్యత్తుపరంగా మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నతంగా ఎదగాలని ఆశీర్వదించారు. సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని అలెటి ఆటం వరల్డ్ లో అభిమానులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో జాజిరెడ్డిగూడెం వైస్ ఎంపీపీ మారిపెద్ది భవానీ శ్రీనివాస్ గౌడ్ పాల్గొని అన్నదానం నిర్వహించారు.. పలువురు ఆయన అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, బాణసంచా కాల్చి కేక్ లు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు.

Next Story