బీఆర్ఎస్‌ను బంగాళాఖాతంలో వేసేందుకు ప్రజలు రెడీ : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

by Disha Web Desk 12 |
బీఆర్ఎస్‌ను బంగాళాఖాతంలో వేసేందుకు ప్రజలు రెడీ : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
X

దిశ, కనగల్లు: తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయింది కానీ పేదవాడి బతుకులు మారలేదు. కేసీఆర్ బంగారు తెలంగాణ తెస్తా అని మన బతుకులు బుగ్గిపాలు చేశాడని నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం లచ్చగూడెం,తిమ్మాజి గూడెం, తుర్కపల్లి, హైదలాపూర్, ఏం. గౌరారం, అమ్మగూడెం, బొమ్మపెళ్లి, కనగల్లు, కనగల్ ఎక్స్ రోడ్, పర్వతగిరి, గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని కౌలు రైతులకు సంవత్సరానికి 15000 రూపాయలు ఇస్తామని విద్య వికాసం పథకం ద్వారా పేద విద్యార్థులకు విద్యతోపాటు ల్యాప్ టాప్స్ ఉచితంగా ఇస్తామని అన్నారు. దళిత బంధు బీసీ బందు ఉచిత గోర్లు ఏ పథకం ఇచ్చిన కమిషన్లు తీసుకున్నారు అని మండిపడ్డారు. బిఆర్ఎస్ ను బంగాళాఖాతంలో వేసేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని నోరు తెరిస్తే అద్భుత ప్రాజెక్టులు అని చెప్పుకున్న ప్రాజెక్టు కుంగుబాటుపై కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, నోరు మెదపకపోవడం సిగ్గుచేటని అన్నారు.

కష్టాలు తీరాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని ఈ ఎన్నికలు నిరంకుశ పాలనకు ఇందిరమ్మ రాజ్యానికి జరుగుతున్న యుద్ధం అని అన్నారు. తెలంగాణను అన్ని రకాలుగా దోచుకుని మరోసారి ముఖ్యమంత్రి కావాలని పగటి కలలు కంటున్నారని అన్నారు. బిఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్న లాలూచీ ఏంటిది అని ప్రశ్నించారు. గోర్లు ఇస్తామని చెబితే యాదవ సోదరులు అప్పులు తెచ్చి డీడీలు కట్టిన ఇప్పటివరకు గోర్లు పంపిణీ చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తామని రెండు లక్షల ఉద్యోగాలు ఏకకాలంలో భర్తీ చేస్తామని అన్నారు. కుటుంబంలో ఒకరికి పింఛను ఇచ్చి అభివృద్ధి అనడం హాస్యాస్పదం గా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో. మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మందడి రామచంద్రారెడ్డి, రాజు రెడ్డి, వెంకట్ రెడ్డి ,నర్సింగ్ కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed