మిషన్ భగీరథ పైపులు లీక్.... రోడ్డు మొత్తం బురద బురద

by Dishanational1 |
మిషన్ భగీరథ పైపులు లీక్.... రోడ్డు మొత్తం బురద బురద
X

దిశ, నేరేడుచర్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి తాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని కొందరు కంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నాసిరక పనులకు తరచూ పైపులు లీకేజీలు పగిలి ఆ నీరు రోడ్లపైకి ప్రవాహిస్తున్నాయి. బుధవారం నేరేడుచర్ల మండలంలోని రామగిరి సమీపంలోని కోదాడ -మిర్యాలగూడ వెళ్ళే ప్రదాన రహదారి ప్రక్కన మిర్యాలగూడ మండలంలోని అవంతిపురం నుండి నేరేడుచర్ల పాలకవీడు గరిడేపల్లి మండలాలకు వచ్చే ప్రధాన మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోవడం వలన ఆ నీరంతా ఒక్కసారిగా రోడ్లపైకి చేరింది. ఆ నీరంతా భారీగా రోడ్లపైకి రావడంతో ఆ మార్గంలో వెళ్ళే వాహనాదారులు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ అధికారులు నీటిని ఆపివేసి వచ్చి మరమ్మత్తులు చేపట్టారు. గతంలోనూ ఈ పైపులైన్ పలుచోట్ల పగిలిపోయిన అనేక సందర్భాలు ఉన్నాయి. వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని పైపులైన్ లీకేజీలను ముందస్తుగా గుర్తించి మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.





Next Story

Most Viewed