జాతీయ రహదారి 65 పై కనిపించని 'బంద్'

by Disha Web Desk 12 |
జాతీయ రహదారి 65 పై కనిపించని బంద్
X

దిశ, చిట్యాల: ఎస్సీ వర్గీకరణ కు సంబంధించిన బిల్లును శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపుమేరకు నేడు నిర్వహించ తలపెట్టిన జాతీయ రహదారి 65 దిగ్బంధం ప్రభావం చిట్యాల మండలం లో ఏమాత్రం కనిపించ లేదు.

ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్కు వెళ్లే ఉద్యోగులు, ఇతర వర్గాల ప్రజలు ఉదయం ఏడు గంటల నుంచి హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధపడ్డారు.

చిట్యాలలో భారీగా మోహరించిన పోలీసులు

జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమం పై ఎలాంటి అవాంతరాలు, నిరసన కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఆదివారం రాత్రి నుండే చిట్యాల పోలీస్ స్టేషన్ కు భారీగా వచ్చారు. ఇతర పోలీస్ స్టేషన్ల నుండి ఒక డీఎస్పీ ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలు, 20 పైగా ఎస్సైలు, 80 కి పైగా కానిస్టేబుల్లు చిట్యాల జాతీయ రహదారిపై మోహరించారు.

ఎమ్మార్పీఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్..

ఆదివారం సాయంత్రమే పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు తీసుకున్నట్లు తెలుస్తుంది చిట్యాల మండలంలో ఉండే 14 మంది ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల ను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌లో నిర్భందించినట్లు సమాచారం. అంతేకాకుండా మండలంలోని వివిధ గ్రామాల నుండి ఎమ్మార్పీఎస్ నాయకులు సానుభూతిపరులు చిట్యాలకు రావడంపై పోలీసులు అభ్యంతరాలు తెలిపినట్లు తెలుస్తుంది.



Next Story

Most Viewed