పీఏపల్లి మండలంలో బెల్ట్ షాపుల జోరు..

by Disha Web Desk 20 |
పీఏపల్లి మండలంలో బెల్ట్ షాపుల జోరు..
X

దిశ, పీఏపల్లి : పీఏపల్లి మండలంలో వైన్ షాప్ నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. వైన్ షాప్ నిర్వాహకుల సిండికేట్ తో ప్రజల జేబుకు చిల్లులు పడుతున్నాయి. వైన్ షాపులు సిండికేట్ కావడంలో సిండికేట్ లో ఆరితేరిన ఆయనే కీలక సూత్రధారి. ఆయన అధికారులకు ఏది చెప్పితే అదే వింటారు. వైన్ షాప్ నిర్వాహకులు బెల్ట్ షాపులకు క్వార్టర్కు 10, ఫుల్లు బాటిల్కు 40 తీసుకొని ప్రజల జేబుకు చిల్లు తెస్తున్నారు. బెల్ట్ షాపు వారు 24 గంటలు బెల్ట్ షాపులు తీసి ఉండడంతో ప్రజలు రోజుతాగి వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడంతోకొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డారు.

కస్టమర్లు అడిగిన బ్రాండ్ ఇవ్వకుండా నకిలీ బ్రాండ్లను అండగట్టడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా నెలవారి మామూలు తీసుకొని సివిల్, ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కూడా సంబంధిత ఉన్నత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed