ప్రమాదవశాత్తు మిషన్​లో పడి వ్యక్తి మృతి

by Disha Web |
ప్రమాదవశాత్తు మిషన్​లో పడి వ్యక్తి మృతి
X

దిశ, భువనగిరి రూరల్ : ప్రమాదవశాత్తు మిషన్లో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన భువనగిరి పట్టణంలో గల ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే భువనగిరిలో గల ఏజీఐ గ్లాస్ ఫాక్టరీ లో గత ఆరు నెలలుగా హెల్పర్ గా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన అమన్ ఫాక్టరీలో గల స్ట్రాకింగ్ సెక్షన్ లో నైట్ డ్యూటీ చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ప్రమాదవశాత్తూ స్ట్రాకింగ్ మిషన్ లో పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. దాంతో తోటి కార్మికులు అతనిని వెంటనే భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం డ్యూటీ డాక్టర్ సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం ఈఎస్ఐ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఫ్యాక్టరీ వలన స్థానికులకు అనేక రకాల ఇబ్బందులు తలెత్తు తున్నాయని, అంతే కాకుండా ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యానికి ఆరోగ్య సమస్యలు కలుగుతున్నాయని, అయినా సంబంధిత అధికారులు మౌనం వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.


Next Story