‘నాకు తెలియదు’.. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి చేరికపై ఎంపీ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Satheesh |
‘నాకు తెలియదు’.. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి చేరికపై ఎంపీ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు మాజీ ఎమ్మెల్యే, తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. హైకమాండ్‌తోనే మాట్లాడారని.. రాజగోపాల్‌రెడ్డి చేరికపై కాంగ్రెస్‌ అధిష్టానానిదే నిర్ణయమని అన్నారు. ఆయనే కాదు.. చాలా మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. ఎవరు, ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది హైకమాండ్‌ నిర్ణయిస్తుందన్నారు. టికెట్ల కేటాయింపుపై పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ అని అన్నారు. అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తామని తేల్చి చెప్పారు.



Next Story