అయోధ్యలో అద్భుతం.. ఇది ఎంతో భావోద్వేగమైన క్షణం అంటూ మోడీ ట్వీట్

by Disha Web Desk 18 |
అయోధ్యలో అద్భుతం.. ఇది ఎంతో భావోద్వేగమైన క్షణం అంటూ మోడీ ట్వీట్
X

దిశ,వెబ్‌డెస్క్: శ్రీరామనవమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలో అద్భుత దృశ్యం అందరినీ ఆకర్షించింది. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో బాల రామయ్యకు ఘనంగా పూజలు చేశారు పండితులు. ఈ క్రమంలో అయోధ్యలో ఓ అద్భుతం కనులవిందు చేసింది. 51 అంగుళాల పొడవుతో ఉన్న 5 ఏళ్ల బాల రాముడి విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకాయి. బాలరాముని నుదుటిపై తిలకంలా సూర్యకిరణాలు సుమారు ఆరు నిమిషాల పాటు పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అయోధ్యలో బలరాముడి నుదిటిపై సూర్యకిరణాలు పడిన క్షణం కోట్లాది మంది భారతీయులతో పాటు తనకెంతో భావోద్వేగ మైనదని ప్రధాన మంత్రి మోడీ అన్నారు. అస్సాం నల్బరిలో ర్యాలీ అనంతరం ఆయన అస్సాం ఫ్లైట్ లో ప్రయాణిస్తూ ట్యాబ్‌లో ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించి, బాలరాముడిని దర్శించుకున్నారు. అయోధ్యలో రామ నవమి ఘనంగా జరగడం చరిత్రాత్మకం. ఈ సూర్య తిలకం మన జీవితాలకు శక్తిని, దేశం మరింత ఉన్నత శిఖరాలకు చేరేలా స్ఫూర్తిని ఇస్తుందని పీఎం మోడీ తెలిపారు. అయోధ్యలోని రామాలయం లో రామ్ లల్లా కొలువుదీరిన తర్వాత ఇదే తొలి రామనవమి అని అన్నారు. ఐదు శతాబ్దాల నిరీక్షణ ఫలించి రామ మందిరంలో బాల రాముడిని పూజించే భాగ్యం లభించిందని ప్రధాని చెప్పారు.

Next Story

Most Viewed