దేశాన్ని ఏకం చేస్తాం: బీజేపీపై MLC కవిత ఫైర్

by Disha Web Desk 19 |
దేశాన్ని ఏకం చేస్తాం: బీజేపీపై MLC కవిత ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి తరుఫున దేశమంతా తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకు రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మె్ల్సీ కవిత పాల్గొని మాట్లాడారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూల్చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ అపహాస్యం చేస్తోందని విమర్శించారు. బీజేపీ ఆరాచకాలను ఆడిగేవారు ఎవరు లేరని.. ఇష్టం వచ్చిన్నట్లు చేస్తోందని మండిపడ్డారు. దీనిపై యువతలో చైతన్యం తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.

సిస్టమ్‌ను మనం కాపాడుకుంటే.. ఆ సిస్టమ్ మనల్ని కాపాడుతుందని తెలిపారు. బీజేపీ వారి వైఫల్యాలను ఎత్తి చూపే వాళ్లను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. దేశంలో బీజేపీ విధానాలను నిలదీసే వ్యవస్థ లేకుండా పోయిందని.. కేంద్రం రకరకాలుగా దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందని అన్నారు. విపక్షాలు అనుకునే వారిపై బీజేపీ ఎటాక్ చేస్తోందని.. లేనిపోని లీకులిచ్చి వ్యక్తిత్వాన్ని చంపేస్తున్నారని అన్నారు. తెలంగాణ తరహా ఉద్యమాన్ని దేశంలో తెస్తామని.. జనజాగృతిని దేశవ్యాప్తంగా విస్తారిస్తామని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మనం ఒక్క పిలుపునిస్తే.. ప్రతిరాష్ట్రంలో మన శాఖ పుడుతోందని తెలిపారు. బీజేపీపై తిరుగుబాటుకు దేశాన్ని ఏకం చేస్తామని చెప్పారు. ఇందుకోసం కవులు, కళాకారులను ఏకం చేస్తామని.. తెలంగాణ తరహా ఉద్యమాన్ని దేశంలో తీసుకు వస్తామని అన్నారు. బీజేపీపై పోరాటం విషయంలో వెనక్కి తగ్గేది లేదని కవిత తేల్చి చెప్పారు.

Read more:

అందుకే నాపై CBI దాడులు: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు..



Next Story

Most Viewed