బిగ్ బ్రేకింగ్ : సీఎం కేసీఆర్‌తో భేటీ ఎఫెక్ట్.. ఈడీకి షాకిచ్చిన MLA Rohith Reddy

by Disha Web Desk 12 |
బిగ్ బ్రేకింగ్ : సీఎం కేసీఆర్‌తో భేటీ ఎఫెక్ట్.. ఈడీకి షాకిచ్చిన MLA Rohith Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో : మనీ లాండరింగ్ చట్ట ఉల్లంఘనలకు సంబంధించి ఈడీ (ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) నుంచి నోటీసులు అందుకున్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సోమవారం జరగాల్సిన విచారణకు గైర్హాజరయ్యారు. ఈ నెల 15న జారీ చేసిన నోటీసులకు అనుగుణంగా ఎంక్వయిరీకి హాజరయ్యేందుకు రాహుకాలం పూర్తికాగానే ఇంటి నుంచి బయలుదేరిన రోహిత్ రెడ్డి ఈడీ ఆఫీసుకు వెళ్ళడానికి బదులుగా బేగంపేటలోని ప్రగతి భవన్‌కు వెళ్ళారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించిన తర్వాత తన వ్యక్తిగత పీఏ శ్రావణ్ ద్వారా ఈడీకి లేఖ పంపించారు. విచారణకు హాజరయ్యేటప్పుడు బ్యాంకు ఖాతాల స్టేట్‌మెంట్లను 2015 నుంచి ఇటీవలి వరకు తీసుకురావాల్సిందిగా ఈడీ అదనపు డైరెక్టర్ పేర్కొన్నారని, కానీ వరుస సెలవుల కారణంగా వాటిని సేకరించడం కుదరలేదని, వారం రోజుల గడువు కావాలాంటూ ఆ లేఖలో రోహిత్ రెడ్డి ఈడీని రిక్వెస్టు చేశారు.

చాలా తక్కువ సమయం ఇవ్వడంతో అన్ని వివరాలను సేకరించడం లేదని పేర్కొన్నారు. నోటీసు అందుకున్న రోజునే ఈడీ షెడ్యూలు ప్రకారం విచారణకు హాజరవుతానంటూ క్లారిటీ ఇచ్చారు. న్యాయవాదులతోనూ సంప్రదింపులు జరిపారు. ఆ ప్రకారమే సోమవారం ఉదయం ఎంక్వయిరీకి హాజరయ్యేందుకు బయటకు వచ్చిన తర్వాత ప్రగతి భవన్ నుంచి ఫోన్ రావడంతో అక్కడకు వెళ్ళినట్లు తెలిసింది.

ఆ తర్వాతనే న్యాయవాది ద్వారా లెటర్ రాసి వ్యక్తిగత పీఏ ద్వారా ఈడీ ఆఫీసుకు పంపించారు. ఈ నెల 25 వరకు అందుబాటులో ఉండనని ఆ లేఖలో రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై ఈడీ రియాక్షన్ ఇంకా వెల్లడి కాలేదు. ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రోహిత్ రెడ్డి విజ్ఞప్తికి తగినట్లుగా గడువు ఇస్తుందా లేదా అనేది సాయంత్రానికి క్లారిటీ కానున్నది.

Also Read: రోహిత్ రెడ్డిపై రఘనందన్ కీలక వ్యాఖ్యలు


Next Story