హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మాట్లాడుతా: మంత్రి ఉత్తమ్

by GSrikanth |
హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మాట్లాడుతా: మంత్రి ఉత్తమ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాపులారిటీ కోసమే బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిత్యం కాంట్రవర్సీ కామెంట్లు చేస్తున్నాడని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. అర్థరహిత ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో యూ-టాక్స్ ఉన్నదని ఏలేటి తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తూ మహేశ్వర్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండాలని తపన పడుతున్నారన్నారు. కనీస అవగాహన లేకుండా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో వంద రోజుల కాంగ్రెస్ పాలన అద్భుతంగా కొనసాగిందన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థను చక్కదిద్దుతున్నామన్నారు. అవినీతికి పాల్పడి యూ-టాక్స్ వసూలు చేశామని అనడం పచ్చి అబద్ధం, దుర్మార్గం అన్నారు. తాను ప్రస్తుతం హైదరాబాద్‌లో లేనని, వచ్చాక మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Next Story

Most Viewed