గణేష్ నిమజ్జనాలు ఎక్కడ చేయాలో సమాచారం అందించాం

by Disha Web Desk 2 |
గణేష్ నిమజ్జనాలు ఎక్కడ చేయాలో సమాచారం అందించాం
X

దిశ, వెబ్‌డెస్క్: గణేష్ నిమజ్జనాలపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రేపటి నుంచే నిమజ్జనాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈసారి 90 వేల మండపాలు ఏర్పాటు చేశారని అన్నారు. ఈ 90 వేల మండపాల నిర్వహకులకు ఎక్కడెక్కడ నిమజ్జనాలు చేయాలో ఇప్పటికే చెప్పామని స్పష్టం చేశారు. నిమజ్జనాల కోసం నగర వ్యాప్తంగా కుంటలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కాగా, నగరంలో వినాయకుడు కొలువు దీరాడు. ప్రధాన రహదారులన్నీ వినాయ విగ్రహాలతో కాంతులీనుతున్నాయి. లంబోదరుడిని తాము ఏర్పాటు చేసిన మంటపాల్లో కొలువుదీరేలా చేసి నవరాత్రులు భక్తి ప్రపత్తులతో కొలిచేందుకు నగర వాసులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇదిలా ఉండగా.. వినాయక మంటపాల నిర్వాహకులకు పోలీసు శాఖ కొన్ని నిబంధనలను విధించింది. స్థాయికి మించి సౌండ్ పొల్యూషన్‌కు పాల్పడటం, అసభ్య నృత్యాలు చేయడం, బలవంతపు చందాలు వసూలు చేయడం వంటివి అంశాలపై కఠిన చర్యలు ఉంటాయని నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేస్తున్నారు.


Next Story

Most Viewed