Talasani: ‘‘సారీ నాదే తప్పు’’.చెంప దెబ్బ ఘటనపై దిగొచ్చిన మంత్రి తలసాని

by Disha Web Desk 19 |
Talasani: ‘‘సారీ నాదే తప్పు’’.చెంప దెబ్బ ఘటనపై దిగొచ్చిన మంత్రి తలసాని
X

దిశ, తెలంగాణ బ్యూరో: గిరిజనుల నిరసనలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగివచ్చారు. బైంసా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబుకు, గిరిజనులకు క్షమాపణ చెప్పారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ రోజూ కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఉండటంతో నా కాలు తొక్కుతూ ముందుకెళ్లాడటంతో గాయమై రక్తమొచ్చిందని, ఆ సందర్భంగానే నెట్టి వేశానన్నారు.

చేయి చేసుకోవడం పొరపాటేనని, సోషల్ మీడియాలో దీన్ని పెద్దగా చేసే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన, దళిత, మైనార్టీ, గిరిజన వర్గాల గొంతుకను అని పేర్కొన్నారు. సేవాలాల్, కొమురం భీం జయంతులను ముందుండి చేస్తానని, ఆ రోజు జరిగిన ఘటనపై వాళ్ల మనోభావాలు దెబ్బతింటే క్షమాపణ చెప్పుతున్న అని పేర్కొన్నారు. బేషజాలకు పోవాల్సిన పరిస్థితి కాదని, అన్యతగా భావించవద్దని విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed