KTR ఎప్పటికీ సీఎం కాలేడు.. Kishan Reddy కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
Minister KTR Will not be CM, Says Union Minister Kishan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: Minister KTR Will not be CM, Says Union Minister Kishan Reddy| తన కొడుకు ఎప్పటికీ సీఎం కాలేడన్న ఫ్రస్టేషన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ వర్ధంతి సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు. గవర్నర్‌ను కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా అవమానాలకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ సర్కార్‌ను ప్రజలు పాతరేయటానికి సిద్ధంగా ఉన్నారని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఓటమి భయంతో సీఎం కేసీఆర్ తప్పుల మీద తప్పులు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. గవర్నర్ 'ఎట్ హోం' కార్యక్రమానికి గైర్హాజరై సీఎం కేసీఆర్ సంప్రదాయాలను మంటగల్పుతున్నాడన్నారు.

గవర్నర్ పర్యటనలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించపోవటం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. బండి సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేయటాన్ని కిషన్ రెడ్డి ఖండించారు. ప్రధాని మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదని పేర్కొన్నారు. తన కాళ్ళ కింద భూమి కదలిపోతోందన్న ఆందోళనలో కేసీఆర్ ఉన్నాడన్నారు. తెలంగాణకు ఏం చేశాడని కేసీఆర్ దేశాన్ని ఉద్దరించడానికి పూనుకున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇంజినీర్ల సూచనలను పక్కనపెట్టి సొంత ఆలోచనతో సాగునీటి ప్రాజక్టులను కేసీఆర్ నిర్మించాడని విమర్శలు చేశారు. బీజేపీలో చేరాలనుకునేవారిపై కేసీఆర్ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని ఆరోపణలు చేశారు. కేసీఆర్ నిరాశ, నిస్పృహలో ఉండి భౌతిక దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. సెంటిమెంట్‌తో ముఖ్యమంత్రి కుర్చీలో కేసీఆర్ ఎక్కువ కాలం కూర్చోలేడని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవలని సూచించారు.

ఇది కూడా చదవండి: RS Praveen Kumar ఇన్ యూఎస్.. NRI లతో ప్రత్యేక సమావేశం

Next Story

Most Viewed