మంత్రి KTR వెంటనే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: బాపురావు డిమాండ్

by Disha Web Desk 19 |
మంత్రి KTR వెంటనే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: బాపురావు డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘వీ6, వెలుగు’ పత్రికపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జాతీయ కౌన్సిల్ సభ్యులు కుడుతాడి బాపురావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వీ6, వెలుగు’లను ఎప్పుడు బ్యాన్ చేయాలో బాగా తెలుసని మీడియా ఎదుట బాహాటంగా కేటీఆర్ వెల్లడించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చానల్, పత్రికపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే జర్నలిజం వ్యవస్థను, జర్నలిస్టులను అవమానించినట్లేనని తెలిపారు.

వెంటనే మంత్రి కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా పార్టీలు తేల్చుకోవాలసిన అంశాన్ని జర్నలిజానికి ఆపాదిస్తూ మాట్లాడటం మంత్రి కేటీఆర్ స్థాయికి తగదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మీడియా పాత్ర ఎనలేనిదనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి మీడియా సంస్థలపై అవాక్కులుచేవాక్కులు పెల్చడం రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని చెప్పారు. పాలకుల తాటాకు చప్పుళ్లకు భయపడకుండా నిత్యం ప్రజల పక్షాన జర్నలిస్టులు తమ కలాన్ని, గళాన్ని వినిపిస్తారని స్పష్టం చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed